అది ఫేక్ న్యూస్ నమ్మకండి.. ఒంటరి మహిళలకు వాహనంపై సిటీ పోలీసుల క్లారిటీ

అది ఫేక్ న్యూస్ నమ్మకండి.. ఒంటరి మహిళలకు వాహనంపై సిటీ పోలీసుల క్లారిటీ

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.. అదేంటంటే రాత్రి వేళ్లలో ప్రయాణించే ఒంటరి మహిళలకు ఏ వాహనం దొరక్క పోతే.. పోలీసులకు ఫోన్ చేయండి.. వారు వాహనం ఏర్పాటు చేస్తారని ఫోన్ నంబర్లతో సహా ప్రచారం జరుగుతోంది.. దీనిపై సిటీ పోలీసులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.  

రాత్రివేళల్లో ఒంటరి మహిళలు వాహనాలు దొరక్క పోతే.. పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది..ఇది ఫేక్ న్యూస్..కొందరు కావాలనే మిస్ లీడ్ చేస్తున్నారు..సోషల్ మీడియాలో ప్రజలు నమ్మొద్దని చెబుతున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ఎవరూ ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.  

రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరి మహిళలు వాహనాలు దొరకని పక్షంలో పోలీసులు ఉచిత వాహన పథకాన్ని ప్రారంభించారు. సాయం కోసం 1091, 7837018555 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే వాహనం ఏర్పాటు చేస్తారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.. సమీపంలోకి  PCR  వాహనం, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని ప్రచారం జరుగుతోంది. 

7837018555 నంబర్ తెలంగాణ పోలీసులకు సంబంధించి కాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ప్రజలు ఎవరూ నమ్మొద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.  

రాత్రి వేళల్లో ప్రయాణించేవారు ఎవరైన ఎమర్జెన్సీ టైంలో 100 కి డయల్ చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు.