మంచిర్యాల, వెలుగు: తాను హాజీపూర్అల్లుడినని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన హాజీపూర్మండలం దొనబండలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గూడెం లిఫ్ట్ పైపులు మారుస్తామని మూడేండ్ల కిందట అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హరీశ్‌రావు ఇప్పటివరకు పనులు చేయలేదని విమర్శించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు నష్టపరిహారం ఇప్పటివరకూ చెలించలేదన్నారు. కేవలం సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్న హరీశ్‌రావు మంచిర్యాలలోని పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, రంగారావు, మోటపలుకుల తిరుపతి, సతీష్ రావు, స్వామిరెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారికి అభినందనసేవా భారతి, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ పొందిన నలుగురు మహిళలు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడంపై రఘునాథ్ రావు హర్షం వ్యక్తం చేశారు. బెజ్జాలకు చెందిన వేముల విష్ణుప్రియ, ఎర్రగుంటపల్లెకు చెందిన జనగామ మల్లేశ్వరి, నాగంపేటకు చెందిన కావేరి లక్ష్మి, మంచిర్యాలకు చెందిన మందపెల్లి అశ్వితను ఆయన అభినందించారు.