ఐపీఎల్ మ్యాచ్.. బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దు : సీపీ తరుణ్ జోషి

ఐపీఎల్ మ్యాచ్..  బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దు :  సీపీ  తరుణ్ జోషి

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా 2024 మార్చి 27వ తేదీన  సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల  మధ్య మ్యాచ్ జరగనుంది.  ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు  భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని  రాచకొండ సీపీ  తరుణ్ జోషి తెలిపారు.  స్టేడియంలో 39 వేల మంది కెపాసిటీ ఉందన్నారు. 2 వేల 5 వందల మంది పోలీసులతో స్టేడియం బయట, లోపల  బందోబస్తు ఉంటుందన్నారు.  360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న సీపీ... కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ మానిటర్ చేస్తామని చెప్పారు.  

Also Read:మైక్రోసాఫ్ట్ విండో కొత్త బాస్గా పవన్ దేవులూరి

స్టేడియం వద్దకు బ్యాగులు, లగేజ్ తీసుకురావొద్దని ..  కెమెరాలు, సిగరేట్స్, బైనక్యులర్స్, హెల్మెట్స్, ఫుడ్ ని స్టేడియం లోపలికి అనుమతించమని స్పష్టం చేశారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయని..  ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉంటాయన్నారు.  సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతిస్తామని తెలిపారు.  హెవీ వెహికిల్స్ ని అనుమతించబోమని, 4 వేల కార్లు, 6 వేల బైక్స్  పార్కింగ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశామన్నారు సీపీ.