డీఏవీ స్కూల్​ను మూసేయొద్దు

డీఏవీ స్కూల్​ను మూసేయొద్దు
  • ఇప్పటికిప్పుడు అందులో చదువుతున్న పిల్లలను మరో స్కూల్​లో చేర్చించలేం
  • కొత్త మేనేజ్ మెంట్​ తో కంటిన్యూ చేయించాలి
  • విద్యాశాఖ అధికారులతో తల్లిదండ్రుల వాదన

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని డీఏవీ స్కూల్ పర్మిషన్ రద్దు నిర్ణయాన్ని స్టూడెంట్ల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన నేపథ్యంలో స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ స్కూల్​లో చదువుతున్న స్టూడెంట్లను బంజారాహిల్స్​కు చుట్టుపక్కల ఉన్న స్కూళ్లలో అడ్జెస్ట్ చేసే విధంగా కమిటీని ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. కానీ ఈ నిర్ణయంతో చాలామంది స్టూడెంట్ల తల్లిదండ్రులు ఏకీభవించడం లేదు. జరిగిన  ఘటన తీవ్రమైనదేనని.. అందుకు ప్రిన్సిపల్, డ్రైవర్​ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ డీఏవీ స్కూల్​లో చదువుతున్న 700 మంది స్టూడెంట్లను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. స్కూల్ గుర్తింపు రద్దు చేయకుండా కొత్త మేనేజ్ మెంట్​తో లేదా ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ కొనసాగించాలని కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం స్కూల్ గుర్తింపును కచ్చితంగా రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో తల్లిదండ్రులందరూ సమావేశమై, విద్యాశాఖ అధికారులను కలుస్తామని చెప్తున్నారు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

కనీసం ఈ అకడమిక్ ఇయరైనా..

స్కూల్​ను మూసేస్తే స్టూడెంట్లు ఎక్కువగా ఇబ్బంది పడతారని తల్లిదండ్రులు అంటున్నారు. సగం అకడమిక్ ఇయర్ అయిపోయిందని ఇప్పటికప్పుడు వేరే స్కూల్​కు మారిస్తే పిల్లలు అడ్జెస్ట్ కావడం కష్టమంటున్నారు. స్కూల్​లో జరిగిన ఘటన తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పేరెంట్స్‌‌‌‌‌‌‌‌తో  మీటింగ్ నిర్వహించారు. స్కూల్​ గుర్తింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని ఆదేశాలిచ్చారు. మంత్రి ఆదేశాల ప్రకారం స్కూల్​కు నోటీసులు ఇస్తామని శనివారం హైదరాబాద్ డీఈవో రోహిణి తెలిపారు. చాలామంది తల్లిదండ్రులు స్కూల్​ను మూసేయొద్దని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్కూల్‌‌‌‌‌‌‌‌లో సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సిలబస్ ఉందని, అకడమిక్ ఇయర్ మధ్యలో స్కూల్ మారిస్తే స్టూడెంట్స్​కు ఇబ్బందని తల్లిదండ్రులు  అంటున్నారు. 

క్లోజ్ చేయొద్దు..

మా పాప ఆరోతరగతి చదువుతుంది. చిన్నారి ఇష్యూ జరిగిన తర్వాత చాలా భయపడ్డాం. వెంటనే స్కూల్​కు వచ్చి మేనేజ్​మెంట్​తో మాట్లాడే ప్రయత్నం చేశాం. టీచర్లు వాళ్లపై ఉన్న ఒత్తిడి వల్ల అసలు మాట్లాడలేదు. స్కూల్‌‌‌‌‌‌‌‌లో టీచర్లు పిల్లలతో బాగుంటారు, ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ ప్రిన్సిపల్ ప్రవర్తన బాగుండేది కాదు. ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలి. కానీ స్కూల్ మాత్రం క్లోజ్ చేయొద్దు. సీసీ కెమెరాలు, కొత్త మేనేజ్ మెంట్, గవర్నమెంట్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంటిన్యూ చేయాలి. 
–మమత, పేరెంట్

తొందరలోనే మీటింగ్..

విద్యాశాఖ మంత్రి ఆదేశించిన తర్వాత స్కూల్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో మీటింగ్ కండక్ట్ చేశాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. పేరెంట్స్ నుంచి కూడా మాకు రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌లు వస్తున్నాయి. కానీ మంత్రి ఆదేశాల ప్రకారం ఒక కమిటీ వేసి బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని మిగతా స్కూల్ మేనేజ్ మెంట్లతో మీటింగ్ పెట్టనున్నాం. 
–రోహిణి, డీఈవో, హైదరాబాద్

స్కూల్ గుర్తింపును రద్దు చేయొద్దు

నేరెడ్ మెట్: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేయొద్దని సఫిల్ గూడ బ్రాంచ్ వద్ద పేరెంట్స్ డిమాండ్ చేశారు. శనివారం సఫిల్ గూడ బ్రాంచ్ డీఏవీ స్కూల్​లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు పిల్లల్ని వేరే స్కూల్​లో జాయిన్ చేయటం చాలా కష్టమన్నారు. పేరెంట్స్ అందరూ కలిసి స్కూల్ రీ ఓపెన్ కోసం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్కూల్​లో సెక్యూరిటీ పెంచాలని.. ఇంటర్నల్ కమిటీ వేయాలన్నారు.