రాణిస్తున్ననప్పుడు మెచ్చుకోవడం.. విఫలమవుతున్ననప్పుడు విమర్శించటం ఒక్క మనవాళికే చెందుతుంది. విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి నానా అవస్థలు పడుతున్న సమయంలో అతన్ని విమర్శించని నోరు లేదు. కోహ్లీని జట్టు నుంచి తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే ఎందరో ఎన్నో మాటలన్నారు. అదే కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్ లో ఉండగా.. అతన్ని ప్రశంసిస్తూ రోజుకొకరు తెరమీదకు వస్తున్నారు.
భారత స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షెజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో గొప్ప ఆటగాడని, పరుగులు ఎలా కొల్లగొట్టాలో అతనికి బాగా తెలుసంటూ ఆకాశానికెత్తారు. "విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ క్రికెటర్. అతనితో బాబర్ ఆజాంను కానీ, నన్ను కానీ పోల్చటం సరికాదు.. అది ముమ్మాటికి తప్పు. అతను ఎంతటి గొప్ప క్రికెటరో రికార్డులు చూస్తూనే తెలుస్తుంది.." అని షెజాద్ ఓ పాక్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistan batter Ahmed Shehzad shares his insights on comparing Virat Kohli with Babar Azam and other cricketers. pic.twitter.com/kQwQ04Wbqt
— CricTracker (@Cricketracker) January 11, 2024
తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం
ఇదిలావుంటే, జనవరి 11న అఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న తొలి టీ20లో కోహ్లీ ఆడట్లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా అతను తప్పుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు.