ఈవీఎంలలో డేటాడిలీట్​ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

ఈవీఎంలలో డేటాడిలీట్​ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఎలక్ట్రానిక్​ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో డేటాను డిలీట్ చేయొద్దని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్షన్​ అనంతరం ఈవీఎంల విషయంలో ఎలాంటి స్టాండర్డ్​ఆపరేటింగ్ ప్రొసీజర్​ను అనుసరిస్తున్నారని ప్రశ్నించింది. 

ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ దాఖలైన పిటిషన్​పై  మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈవీఎంలలో డేటాను తొలగించొద్దని, కొత్తగా రీలోడ్​ చేయొద్దని, వాటిని పరిశీలించాల్సి ఉందని సీజేఐ సంజయ్ ​ఖన్నా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. 

ఓడిపోయిన అభ్యర్థి సందేహాలను నివృత్తి చేయాల్సిన, ఈవీఎం ట్యాంపరింగ్​ కాలేదని నిరూపించాల్సిన భాధ్యత ఇంజినీర్​పై ఉంటుందని పేర్కొన్నది. ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ.. 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.