షాక్ కొడుతుంది: ఎక్కువ తిననివ్వదు..గోళ్లు కొరకనివ్వదు

షాక్ కొడుతుంది: ఎక్కువ తిననివ్వదు..గోళ్లు కొరకనివ్వదు

చెత్త అలవాట్లను చెత్త రేగ కొట్టమంటే చాలా మందికి మనసొప్పదు. పోన్లే ఈ ఒక్కసారికీ తిందును. రేపో పావుగంట ఎక్సర్ సైజులు ఎక్కువగా చేస్తాన్లే! అరే పోస్టులు బాగున్నాయే.. మరో గంట సోషల్ మీడియాలో తిరిగేస్తాను. కావాలంటే రేపు ఈ టైం కొంచెం తగ్గించుకుంటాలే! ఇలా మనకు మనం కుంటి సాకులు చెప్పుకుని, ఆ రోజుకు అలా కానిచ్చేసిన సందర్భాలకు లెక్కాపత్రం ఉండదు. చాలా మందికి అలా చేయాలని లేకపోయినా.. అప్పటివరకూ ఆ వస్తువు మనపై చూపెట్టే ప్రభావం మనసును లాగుతుంది. ఆ ఫీల్ నుంచి బయటపడాలంటే చిన్న షాక్ కావాలి. దాన్నే ‘అమెజాన్’ రెడీ చేసింది. చేతికి వాచ్ లా పెట్టుకునే చిన్న ఎలక్ట్రిక్ డివైస్‌ను అమెజాన్ కంపెనీ తయారు చేసింది. అతిగా తిన్నా, గోళ్లు కోరికినా, ఇంటర్నెట్ ఎక్కువ సేపు వాడినా, ఎక్కువగా నిద్రపోతున్నా, పొగ తాగుతున్నా ఈ డివైజ్ అస్సలు ఒప్పుకోదు. చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్స్ తో మందలిస్తుంది. ఇప్పటికే ఎక్కువైంది పదా.. అంటూ గదమాయిస్తుంది! అంతేకాదు దీనికి తోడుగా ఓ యాప్ ను కంపెనీ తయారు చేయించింది. దాని పేరు పావ్ లాక్. ఈ యాప్ మన యాక్టివిటీని రికార్డు చేస్తుంది. తాను చెప్పినా వినకుండా తినేశాడని, తాగేశాడని, నిద్రపోయాడని సన్నిహితులకు తెలియజేస్తుంది. హహహ.. అంటే పేరెంట్స్ పిల్లల్ని ఈజీగా పట్టేయొచ్చన్నమాట. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 150 సార్లు షాక్స్ ఇస్తుందని అమెజాన్ వెల్లడించింది. దీని ధరను 242 డాలర్లుగా నిర్ణయించింది. 350 వోల్టుల ఎనర్జీతో ఇది ఇచ్చే షాక్ కు, పెట్టుకున్న వ్యక్తి ఎగిరి గంతేస్తాడని పేర్కొంది.