బీకేర్ ఫుల్.. ఇండియా పోస్ట్ ఫేక్ డెలివరీ మేసేజ్లు వస్తున్నాయి..క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ

బీకేర్ ఫుల్.. ఇండియా పోస్ట్ ఫేక్ డెలివరీ మేసేజ్లు వస్తున్నాయి..క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు..ఇప్పుడు పోస్టాపీసుపై పడి ఖాతాదారులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సేమ్ టు సేమ్ ఇండియా పోస్ట్ మాదిరిగానే మేసేజ్ లు, లింక్ లు పంపుతూ ఇంపార్టెంట్ డేటా, నగదు కాజేస్తున్నారు. లింకులు పంపించి ఆ సైట్ లద్వారా మీ డివైజ్ లోకి మాల్వేర్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. దీనివ ల్ల మీ డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. 

ఇలాంటి మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఆన్ లైన్ స్కాముల గురించి కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. 

  • ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్ వినియోగిస్తున్నారు.. ఇలాంటి స్కామ్ లను కట్టడి చేయాలంటే అలెర్ట్ గా ఉండాలి. 
  • అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దు. 
  • URLలను తెరవడానికి ముందు అవి నకిలీవా కాదా చెక్ చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడాలి.  ఏవైనా అప్డేట్ చేయాలంటే ఇండియా పోస్ట్ వెబ్‌సైట్(www.indiapost.gov.in) ను సందర్శించాలి. 
  • వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. 
  • ఇండియా పోస్ట్ SMS లేదా లింక్‌ల ద్వారా చిరునామా అప్డేట్లను ఎప్పూడు అడగదు..ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 
  • అటువంటి మోసపూరిత మేసేజ్లు వస్తే cybercrime.gov.inకు లేదా PIB ఫ్యాక్ట్ చెక్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్కు రిపోర్టు చేయాలి.