
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్1–19 మధ్య ప్రయాణించొద్దని ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూ ప్రయాణికులను హెచ్చరించాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏండ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని అన్నాడు. అందుకే ఆయా తేదీల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశాడు.
పన్నూ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. గతేడాది నవంబరులోనూ ఇలాంటి వీడియోను విడుదల చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నవంబర్ 19న మూతపడనుందని దాని పేరు కూడా మార్చేస్తామని హెచ్చరించాడు. దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ గురు పత్వంత్ సింగ్ పన్నూ ఈ వ్యాఖ్యలు చేశాడు.