నిజామాబాద్రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన కార్యకర్తలు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్సూచించారు.
బుధవారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమని, రాజకీయాల్లో ఉన్నవారు రెండింటిని సమానంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కకుమించి హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ హమీలన్నీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఇందుకోసం కార్యకర్తల సహకారం కావాలని కోరారు. ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థలు, పార్లమెంట్ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.