జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి

జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు :  సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. 

శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు.  జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దని..  జీఎస్టీ రిటర్న్స్‌లలో అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు.  మద్యం అమ్మకాలు పెరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగలేదన్నారు సీఎం.  రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.  

సెక్రటేరియట్ లో వివిధ శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై చర్చించారు. సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్, మైనింగ్ శాఖలపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పన్నుల ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

రాష్ట్రంలో ఖరీఫ్ 2024 కార్యాచరణకు సమాయత్తమైంది రాష్ట్రప్రభుత్వం. రుణమాఫీ విధివిధానాలపై అధికారులతో చర్చించారు మంత్రులు. 2024 ఖరీఫ్ నుంచి అమలయ్యే పంటల బీమా విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెండర్లలో నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు పరిశీలించుకొని.. రైతులు పంటనష్టపోతే బీమా పథకం వారిని ఆదుకొనేలా ఉండాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.