అట్రాసిటీ కేసులు పెండింగ్ ​ఉంచొద్దు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అట్రాసిటీ కేసులు పెండింగ్ ​ఉంచొద్దు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్​అట్రాసిటీ కేసులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. కేసుల విచారణ పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లోని బాధితులకు న్యాయం అందించాలని, కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉంచొద్దని సూచించారు. 

రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ..  బాధితులకు న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, లక్ష్మీనారాయణ, శంకర్,  డీసీపీలు పద్మజ,  ప్రవీణ్ కుమార్, అక్షాన్స్ యాదవ్, అరవింద్ బాబు, ఇందిర, జి.నరసింహారెడ్డి, సునీతారెడ్డి పాల్గొన్నారు.