డిండి, వెలుగు : ఓటర్ లిస్ట్‌లో జాబితాలో లేకుండా చూడాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల స్థాయిబూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
బీఎల్ఓలకు ఓటర్ నమోదు ప్రక్రియ, జాబితాలో మార్పులు చేర్పులు, తుది జాబితా తయారు చేయడంపై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ శ్రీనివాస్, శేఖర్, రాజశేఖర్, ఇన్చార్జి ఎంపీడీవో డానియల్, ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఉన్నారు.