సమగ్ర కుటుంబ సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: ఎం.దానకిశోర్

సమగ్ర కుటుంబ సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు: ఎం.దానకిశోర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వంద శాతం కచ్చితత్వంతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని మున్సిపల్ ప్రిన్సిపల్​సెక్రెటరీ ఎం.దానకిశోర్ సూచించారు. ఖైరతాబాద్ జోన్‎లో చేపట్టనున్న సర్వేపై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు శుక్రవారం బంజారాహిల్స్ గౌరీశంకర్ కమ్యూనిటీ హాల్‎లో శిక్షణ ఇచ్చారు. దానకిశోర్ పాల్గొని పలు సూచనలు చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలన్నారు. గ్రేటర్ పరిధిలో 21 వేల మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటున్నామన్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్‎ను నియమించామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(లేక్స్) కె.శివకుమార్ నాయుడు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.