Aadhar Update: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పెంచారు..డోంట్ మిస్

Aadhar Update: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పెంచారు..డోంట్ మిస్

ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులను 10 సంవత్సరాల కొకసారి అప్డేట్ చేసుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ అప్డేట్ కోసం గడువును మరోసారి పెంచింది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. 

అయితే ఆధార్ అప్డేట్ కోసం ఇదే చివరి అవకాశం కావచ్చు. గతేడాది, ఈ సంవత్సరం కూడా అనేక సార్లు గడువును పెంచింది. తదుపరి పొడిగింపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ఆధార్ ఇంకా అప్డేట్ చేసుకోని వారు అప్డేట్ చేసుకోవాలి. 

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి పది సంవత్సరాలకు వారి POI , POA పత్రాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఇది 5 నుంచి 15 సంవత్సరాల వయస్సులో వారి పిల్లల బ్లూ ఆధార్ కార్డ్‌పై బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి కూడా వర్తిస్తుంది.