ఫోన్​ ఎత్తొద్దు.. మళ్లా చేయొద్దు మిస్డ్‌కాల్స్‌తో అకౌంట్స్​ హ్యాక్​

ఫోన్​ ఎత్తొద్దు.. మళ్లా చేయొద్దు మిస్డ్‌కాల్స్‌తో అకౌంట్స్​ హ్యాక్​
  • సైబర్​ నేరగాళ్ల కొత్త మోసం
  • ఆన్‌‌‌‌లైన్‌లో వర్చువల్ నంబర్స్ కొనుగోలు  
  • ఫేక్ ప్రొఫైల్‌తో ట్రూ కాలర్‌‌, అమ్మాయిల డీపీ
  • ఇతర దేశాల నంబర్స్‌‌తో మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చి ట్రాప్ 
  • అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు 
  • +91 మినహా ఇతర దేశాల కోడ్‌ నంబర్స్‌తో జాగ్రత్త అని వార్నింగ్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మీకు మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ +91తో కాకుండా ఇతర కోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాల్స్ వచ్చి కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందా? అయితే  జాగ్రత్త.. తిరిగి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకండి. అది సైబర్ నేరగాళ్ల కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావచ్చు. కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారంటే బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింకైన మీ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లినట్లే. రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్తరకం మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు. మిస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినవారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పామ్ కాల్స్ సహా వర్చువల్ కాల్స్‌‌‌‌ నంబర్స్‌‌‌‌పై సోషల్‌‌‌‌మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

వర్చువల్‌‌‌‌ నంబర్స్‌‌‌‌తో స్పామ్‌‌‌‌ కాల్స్‌‌‌‌ 

బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌తో లింక్ అయిన ఫోన్ నంబర్స్‌‌‌‌ను సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌ చేసుకుంటున్నారు. +91 మినహా+255, +371 సహా ఇతర దేశాలకు చెందిన ఐఎస్‌‌‌‌డీ  కాల్స్‌‌‌‌ చేస్తున్నారు. ఇందుకోసం వివిధ దేశాల కోడ్స్‌‌‌‌తో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వర్చువల్‌‌‌‌ ఫోన్ నంబర్స్‌‌‌‌ కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్‌‌‌‌(వీఓఐపీ) నంబర్స్‌‌‌‌ వినియోగిస్తున్నారు. నేషనల్ బ్యాంక్స్ పేర్లతో ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌, అందమైన అమ్మాయిల డీపీలు పెట్టుకుంటున్నారు. కొన్ని కాల్స్‌‌‌‌కి ఆన్సర్ చేసినప్పటికీ #90 లేదా #09ను డయల్‌‌‌‌ చేయాలని సూచిస్తున్నారు. డయల్ చేసిన వారి అకౌంట్‌‌‌‌ను  హ్యాక్ చేస్తున్నారు. 

రిటర్న్‌‌‌‌ కాల్‌‌‌‌ చేస్తే ఆటోమెటిక్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌

వర్చువల్ నంబర్స్‌‌‌‌తో కాల్‌‌‌‌ చేసి ఆన్సర్ చేసే లోగా కట్‌‌‌‌ చేస్తున్నారు. తిరిగి కాల్‌‌‌‌ చేసిన వారి నంబర్స్‌‌‌‌ ఆటోమెటిక్‌‌‌‌గా లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే వారి ఫోన్‌‌‌‌ నంబర్స్‌‌‌‌తో లింకైన బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ సమాచారం సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. వీటితో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్టు టెలికాం సంస్థలు, సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మిస్డ్‌‌‌‌ కాల్స్‌‌‌‌  ద్వారా ‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’ కూడా జరుగుతున్నదని టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. మిస్డ్ కాల్‌‌‌‌ వచ్చిన నంబర్స్‌‌‌‌కి తిరిగి కాల్ చేస్తే స్పందించకూడదని సూచిస్తున్నాయి. ఇదే కాకుండా కాల్‌‌‌‌ రిసీవ్‌‌‌‌ చేసుకునే నేరగాళ్లు గిఫ్ట్‌‌‌‌ ఫ్రాడ్‌‌‌‌ సహా పలు రకాల స్కీమ్స్‌‌‌‌ పేరు చెప్పి ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కోడ్ చూసుకొని  ఫోన్​ లిఫ్ట్​ చేయాలి

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని నంబర్స్‌‌‌‌ నుంచి మిస్డ్​ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్‌‌‌‌ నంబర్ ముందు కోడ్‌‌‌‌ చెక్‌‌‌‌ చేసుకోవాలి. కొన్ని స్పామ్ కాల్స్‌‌‌‌కి తిరిగి కాల్ చేస్తే కనెక్ట్‌‌‌‌ కావు. సైబర్ నేరగాళ్లు వర్చువల్ ఫోన్ నంబర్స్‌‌‌‌, బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ వినియోగిస్తున్నారు.  +91 ఉంటే మాత్రమే అది ఇండియాలో వినియోగిస్తున్న నంబర్‌‌‌‌‌‌‌‌గా గుర్తించాలి. ఇతర నంబర్స్‌‌‌‌తో కాల్‌‌‌‌ చేసి #90 లేదా #09ను డయల్ చేయాలని కోరితే.. ఎట్టి పరిస్థితుల్లోను చేయద్దు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేయాలి. - కవిత, డీసీపీ, హైదరాబాద్‌‌‌‌ సైబర్ క్రైమ్