ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించొద్దు: అదర్ బ్యాక్​వర్డ్​ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించొద్దు: అదర్ బ్యాక్​వర్డ్​ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్

ముషీరాబాద్,వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరించొద్దని ఆల్ ఇండియా అదర్ బ్యాక్​వర్డ్​ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి కరుణానిధి డిమాండ్ చేశారు. ఆదివారం (March 16) బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. 

రాజ్యాంగ విరుద్ధంగా ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఓబీసీ సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రవికుమార్, దానకర్ణ చారి, చిన్నయ్య, పాండు, రామ్మూర్తి, గణేశ్​, మహేశ్​తదితరులు పాల్గొన్నారు.