గూగుల్‌‌‌‌లో వీటిని అస్సలు వెతకొద్దు

గూగుల్‌‌‌‌లో వీటిని  అస్సలు వెతకొద్దు

తెలియని వాటికి జవాబు కోసం ‘గూగుల్‌‌‌‌’ చేయడం ఇప్పుడు సర్వసాధారణం. ఫుడ్‌‌‌‌ ఎట్లా తయారు చేయాలో తెలుసుకోవడం నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ వరకు, చివరికి మెడిసిన్‌‌‌‌ కొనడానికి కూడా గూగుల్‌‌‌‌ను వాడేస్తున్నారు. కానీ అందరూ ఓ విషయం మర్చిపోతున్నారు. గూగుల్‌‌‌‌ ఓ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫాం అని, దానికి ప్రత్యేకంగా కంటెంట్‌‌‌‌ అంటూ ఉండదని, అది చూపించే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు మనకు సమాచారం ఇస్తాయని పట్టించుకోవట్లేదు. గూగుల్‌‌‌‌లో దొరికే ప్రతీదీ కరెక్టవ్వాల్సిన అవసరమూ లేదు. అందుకే సెర్చ్‌‌‌‌ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ పన్నెండింటి విషయంలోనైతే ఇంకాస్త అలర్ట్‌‌‌‌గా ఉండాలి.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లు

గూగుల్‌‌‌‌లో నకిలీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లు మస్తున్నయ్‌‌‌‌. చూడటానికి నిజమైన బ్యాంకు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లాగే ఉంటుంది. కాస్త అజాగ్రత్తగా ఉండి ఐడీ, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ఇచ్చారంటే అంతే. పైసలు పోవుడే. కాబట్టి బ్యాంకు యూఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ తెలిస్తేనే సెర్చ్‌‌‌‌ చేయడం ఉత్తమం.

కంపెనీల కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ నంబర్లు

పాపులర్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ స్కామ్‌‌‌‌లలో ఇదీ ఒకటి. మోసం చేసేవాళ్లు నకిలీ నంబర్లు, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లను స్టార్ట్‌‌‌‌ చేసి కస్టమర్లను బోల్తా కొట్టిస్తరు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మోసాల గురించి తెలియని వాళ్లు ఈజీగా వీళ్ల బుట్టలో పడిపోతారు. డబ్బులు పోగొట్టుకుంటారు.

సాఫ్ట్‌‌‌‌వేర్లు, యాప్‌‌‌‌లు

మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లను గూగుల్‌‌‌‌ ప్లే, ఆండ్రాయిడ్‌‌‌‌, యాప్‌‌‌‌ స్టోర్‌‌‌‌ లాంటి అఫీషియల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లలోనే డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవడం బెటర్‌‌‌‌. గూగుల్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేస్తే ఫేక్‌‌‌‌ యాప్‌‌‌‌లు రావొచ్చు. వాటితో మాల్‌‌‌‌వేర్‌‌‌‌ కూడా ఇన్‌‌‌‌స్టాలై ఫోన్‌‌‌‌ లాకవొచ్చు. అందులోని డేటా పోవచ్చు.

రోగం లక్షణాలు, మెడిసిన్‌‌‌‌

కాస్త తలనొప్పి వచ్చినా, జ్వరమొచ్చినా లక్షణాలేంటని సెర్చ్‌‌‌‌ చేయడం ఈమధ్య కామన్‌‌‌‌ అయిపోయింది. కానీ  డాక్టర్‌‌‌‌ దగ్గరకు పోకుండా గూగుల్‌‌‌‌పై ఆధారపడటం చాలా డేంజర్‌‌‌‌. గూగుల్‌‌‌‌లో దొరికిన సమాచారం ఆధారంగా మెడిసిన్‌‌‌‌ కొనడం ఇంకా డేంజర్‌‌‌‌.

న్యూట్రిషన్‌‌‌‌, డైట్‌‌‌‌

డైట్‌‌‌‌ను మార్చుకోవాలనుకుంటే డైటీషియన్‌‌‌‌ దగ్గరకు పోండి. బరువు తగ్గాలనుకుంటే డాక్టర్‌‌‌‌ సలహా తీసుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి బాడీ ప్రత్యేకమే. అందరికీ ఒకే మందు పని చేయదు. ఒకే తిండి వంటబట్టదు. వీటి గురించి గూగుల్‌‌‌‌లో వెతక్కపోవడమే బెటర్‌‌‌‌.

స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌, ఆర్థిక సలహాలు

మనుషుల ఆరోగ్యం లాగానే బిజినెస్‌, పర్సనల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ గురించి కూడా గూగుల్‌‌‌‌లో అస్సలు వెతకొద్దు. ఎందకంటే అందరినీ ధనవంతులు చేసే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ అనేది ఉండదని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి వాటి గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేయడం మానుకోండి.

గవర్నమెంట్ వెబ్‌‌‌‌సైట్లు

బ్యాంకింగ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లలానే గవర్నమెంట్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లనూ నెట్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేయకపోవడమే మంచిది. మున్సిపాలిటీ ట్యాక్స్‌‌‌‌, హాస్పిటళ్లు మోసం చేసేవాళ్ల ఫస్ట్‌‌‌‌ టార్గెట్‌‌‌‌. ఏది కరెక్టు వెబ్‌‌‌‌సైటో, ఏది కాదో గుర్తు పట్టడం కష్టం. వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ లింకునే టైప్‌‌‌‌ చేయడం బెటర్‌‌‌‌.

సోషల్‌‌‌‌ మీడియా వెబ్‌‌‌‌సైట్లు

యూఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ టైప్‌‌‌‌ చేసే మీ సోషల్‌‌‌‌ మీడియా వెబ్‌‌‌‌సైట్లకు లాగిన్‌‌‌‌ అవండి. లాగిన్‌‌‌‌ పేజ్‌‌‌‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌‌‌‌ చేస్తే అలానే ఉండే నకిలీ వెబ్‌‌‌‌సైట్లు వచ్చే చాన్స్‌‌‌‌ ఉంటుంది. మోసగాళ్లు మీ డేటా మొత్తం గాయబ్‌‌‌‌ చేయొచ్చు. వేరే పనులకు వాడుకోవచ్చు జాగ్రత్త.

ఈ కామర్స్‌‌‌‌ సైట్లు, ఆఫర్లు

ఈ కామర్స్‌‌‌‌ సైట్ల గురించి గూగుల్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేస్తే మస్తు లింకులొస్తయ్‌‌‌‌. ఆఫర్ల గురించి వెతికితేనైతే చెప్పలేనన్ని వెబ్‌‌‌‌సైట్లు. మోసగాళ్లు వైరస్‌‌‌‌ ఉన్న వెబ్‌‌‌‌సైట్లను క్లిక్‌‌‌‌ చేసేలా ఆకర్షిస్తారు. నొక్కినమంటే అంతే. ఫోను, సిస్టమ్‌‌‌‌కు వైరస్‌‌‌‌ వచ్చి నాశనమైపోతాయి.

యాంటీ వైరస్‌‌‌‌ యాప్స్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌వేర్స్‌

యాంటీ వైరస్‌‌‌‌ యాప్‌‌‌‌లు, సాఫ్ట్‌‌‌‌వేర్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో గూగుల్‌‌‌‌లో వెతకొద్దు. నకిలీ ప్రొడక్టులను ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేసుకున్నారో అంతే. మీ పర్సనల్‌ సమాచారం చోరీ అవుతుంది.  ‘

కూపన్‌‌‌‌ కోడ్లు

షాపింగ్‌‌‌‌ చేసినప్పుడు కూపన్‌‌‌‌ కోడ్‌‌‌‌ వస్తే ఓకే. అట్లగాదని గూగుల్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేశారనుకోండి ఇబ్బందే. తక్కువ ధరలకే వస్తువులొచ్చే ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేశారనుకోండి. చీప్‌‌‌‌గా వస్తువులు వచ్చినట్టే కనబడ్తది. కానీ మీ బ్యాంకు సమాచారం దొంగలించేస్తరు.

పోర్న్‌‌‌‌ గురించి

గూగుల్‌‌‌‌ యాడ్లు ఎట్ల పని చేస్తయో అందరికీ తెలిసిందే. మనం ఏం సెర్చ్‌‌‌‌ చేస్తే దానికి సంబంధించి యాడ్లు, పాపప్స్‌‌‌‌ వస్తుంటాయి. పోర్న్‌‌‌‌ గురించి సెర్చ్‌‌‌‌ చేశారనుకోండి. తర్వాత మీకు అవసరం లేకున్నా ఏదో టైంలో పాపప్స్‌‌‌‌ వచ్చాయనుకోండి ఇబ్బందిగా ఉంటుంది.

Don't search these things on Google