సైబర్ మోసానికి కొత్త ప్లాన్: పాత ఫోన్లకు టిఫిన్ బాక్సులు ఇచ్చి.. బీహారీ గ్యాంగ్ డేటా చోరీ..

సైబర్ మోసానికి కొత్త ప్లాన్: పాత ఫోన్లకు టిఫిన్ బాక్సులు ఇచ్చి.. బీహారీ గ్యాంగ్ డేటా చోరీ..
  • డేటాచోరీకి కొత్త ఎత్తుగడ
  •  బీహారీ గ్యాంగ్ సైబర్ మోసం
  • ఇప్పటి వరకు 12 వేల మొబైల్స్ సేకరించినట్లు గుర్తింపు
  • 2125 మొబైల్స్ సీజ్

ఆదిలాబాద్: చిన్న మొబైల్ కు చిన్న టిఫిన్ బాక్సు...పెద్ద ఫోన్ కు పెద్ద టిఫిన్ బాక్స్.. రండి త్వరపడండి బ్యాటరీల లేనివి, పగిలిపోయిన.. మొబైల్ పనిచేయకుండా ఉన్నా సరే.. మాకు ఇస్తే మీకు టిఫిన్ బాక్సులు ఇస్తాం అంటూ గ్రామాల్లో మైకులు అనౌన్స్ చేసుకుంటూ తిరుగుతున్న బీహార్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అమాయక ప్రజలకు గిఫ్ట్ బాక్స్ లు ఆశ చూపి ఫోన్లలో వ్యక్తిగత డేటాను సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులు చిక్కారు. 

పాత ఫోన్లో సేకరించిన డేటాతో కాల్చేస్తూ బ్యాంక్ అధికారులమని. ఉద్యోగాలు ఇప్పిస్తామని.. లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూవివిధ రకాలుగా నమ్మిస్తూ ఓటీపీల ద్వారా అమాయకుల బ్యాంకఖాతాల్లో కొల్లగొడుతు న్నారు. బీహర్ కు చెందిన ఆరుగురు గ్యాంగ్ గా ఏర్పాడి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొదట ఊరురా బైక్ లపై తిరుగుతూ పాత ఫోన్లకు ప్లాస్టిక్, టిఫిన్ బాక్స్లు ఇస్తారు. ఇక్కడ సేకరించిన ఫోన్లను బీహర్కు తీసుకెళ్లి మొబైల్ ద్వారా సేకరించిన డేటాతో కాల్స్ చేస్తూ ఎంతో మంది అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా దాదాపుగా 12 వేల వరకు మొబైల్స్ సేకరించిన్నట్లు తెలుస్తోంది. 

ఇందుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఇవాళ మీడియాకు వెల్లడిం చారు. ఇందులో బీహర్కు చెందిన ఆరుగు రిని అరెస్ట్ చేసి, వీరి నుంచి 2125 మెబైల్స్, 107 సిమ్స్, 600 బ్యాటరీలు స్వాధీనం చేసు కున్నారు. సైబర్మాసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పదంగా గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.