మీరు బాత్ రూంలో ఎక్కువ సమయం గడుపుతున్నారా..తరుచుగా సెల్ ఫోన్లు, ట్యాప్ టాప్ లు, ట్యాబ్ లతో కాలక్షేపం చేస్తున్నారా..బాత్ రూంలో అధిక సమయం గడిపితే ఏమవుతుందో ఎప్పుడైన ఆలోచించారా.. ఇటీవల అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
కొంతమంది సాధారణంగా వాష్ రూం కు వెళ్లినప్పుడు సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాబ్ టాప్ లు ఉపయోగిస్తుంటారు. బాత్ రూంలో ఎక్కువ సమయం గడపడం వల్ల పెద్దగా నష్టమేముంటుంది అని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. టాయిలెట్ లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెమరాయిడ్స్, పెల్విక్ కండరాలు బలహీన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. పెల్విక్ కండరాలు బలహీనపడటానికి ఎక్కువ సమయం బాత్ రూంలో కూర్చోవడం కూడా ఓ కారణమని డల్లాస్ లోని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ కొలొరెక్టల్ సర్జన్లు చెబుతున్నారు.
బాత్ రూంలో ఎక్కువ సమయం ఉంటే సమస్య ఎందుకంటే..
గురుత్వాకర్షణ శక్తి మనల్ని భూమిపై గుంజుతుంది అంది మనందరికి తెలుసు. మన రక్తప్రసరణ కూడా ఆవైపు ఎక్కువగా ఉంటుంది. అయితే గుండెకు రక్తప్రసరణ జరగాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. భూమ్యాకర్షణ శక్తి కిందకి లాగడంతో మన రక్త ప్రసరణపై ప్రభావం ఉంటుంది.
టాయిలెట్ లో కూర్చోవడం వల్ల .. సాధారణంగా సీటులో కూర్చోవడం సమయంలో కంటే అధికంగా రక్తప్రసరణలో తేడా వస్తుందని అంటున్నారు. ఫలితంగా దిగువ పురీష నాళం చుట్టూ ఉన్న సిరలు, రక్తనాళాలు పెద్దవిగా , ఎక్కువ రక్తంతో నిండుతాయట. దీంతో పైల్స్(హెమోరాయిడ్స్ )ప్రమాదాన్ని పెంచుతుందట.
బలవంతంగా వడకట్టడం ( బలవంతంగా మల విసర్జన) వల్ల హెమరాయిడ్స్ ఏర్పడటానికి అవకాశం పెరుగుతుంది. టాయిలెట్ లో సెల్ ఫోన్లు స్క్రోల్ చేస్తూ ఉండటం సమయంలో కోల్పోవడమే కాకుండా ప్రేగు కదలికలకు కూర్చుని కండరాలను ఒత్తిడి పెంచడం వల్ల హెమరాయిడ్స్(పైల్స్(మొలలు) సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
బలహీనమైన ఆసన కండరాలు ఒత్తిడికి గురికావడంతో పాటు టాయిలెట్ బౌల్‌పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా మల బద్ధకం ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. పెద్ద పేగులో భాగమైన పురీషనాళం క్రిందికి జారి, మలద్వారం నుంచి బయటకు (రెక్టల్ ప్రోలాప్స్ )వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. తరుచుగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెల్విక్ ఫ్లోర్‌పై గురుత్వాకర్షణ పీడనం కండరాలను ఒత్తిడి చేస్తుంది.
బాత్రూం వెళ్లిన సమయంలో జాగ్రత్తలు
బాత్ రూం లకు వెళ్లినపుడు సాధ్యమయినంతవరకు ఫోన్లు, మ్యాగజైన్లు, పుస్తకాలను తీసుకెళ్లకుండా నిరోధించాలని సలహా ఇస్తున్నారు. వీలైనంతవరకు టాయిలెట్ పై సమయం తగ్గించాలని కోరుతున్నారు.