ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. 'కాళ్లకు దండం పెట్టే సంస్కృతి' ని వీడాలని పిలుపునిచ్చారు. కాదని, ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. టీడీపీ అధినేత శుక్రవారం(జులై 13) అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడున్న ప్రజలు వినతీ పత్రాలు ఇస్తూ ఆయన కాళ్ల మీద పడ్డారు. దీంతో ఎంతో మనోవేదనకు లోనైన చంద్రబాబు కాళ్లకు దండం పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేవుళ్లకు మాత్రమే..!
"నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలి. తల్లిదండ్రులు, గురువులు, దేవుళ్ల కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి. ఈ రోజు నుంచి ఎవరు అలా చేయకండి. ఈ దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా.." అని చంద్రబాబు ప్రజలకు సీఎం సూచించారు. ఇదే విషయాన్ని టీడీపీ పార్టీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేసింది.
ALSO READ | మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో ఉచిత బస్సు ఆ రోజు నుంచే..
నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలి. తల్లిదండ్రులు, గురువులు, దేవుళ్ల కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి.
— Telugu Desam Party (@JaiTDP) July 13, 2024
-ముఖ్యమంత్రి చంద్రబాబు గారు#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/3qrMk2DCNY