తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పుణ్య దర్శనాలకు వచ్చే భక్తులు, ఆలయం చుట్టూ ఉన్న దుకాణ దారులు, చిరు వ్యాపారులు, ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని బంద్ చేసి, బయోడీగ్రేడబుల్ సంచులనే వాడాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వన దేవతల ఆలయ ప్రాంగణంలో ఆదివారం పూజారులు, అభ్యుదయ సంఘం సభ్యులు
గ్రామ పెద్దలు బయోడీగ్రేడబుల్ సంతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ స్థానికంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు, సారలమ్మ దేవత పూజారి కాక సారయ్య, సమ్మక్క దేవత పూజారి కొక్కెర రమేశ్, యూత్ ఉపాధ్యక్షుడు ఆలం వెంకటేశ్, సిద్ధబోయిన రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.