వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఫికర్ వద్దు

డేటా ప్రైవసీ.. కొన్నేండ్లుగా తరచూ వినిపిస్తున్న మాట. ఎంత ఎక్కువ డేటా ఉంటే.. దానిని ఎంత సమర్థంగా వ్యాపారానికి వాడుకోగలిగితే అంత సంపద సృష్టించవచ్చు. గూగుల్ మొట్టమొదట ఈ సూత్రాన్ని పట్టుకుంది. ఆ తర్వాత ఫేస్​బుక్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు డేటా మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెరతీశాయి. ఒక మనిషి గురించి అతని ఫ్యామిలీ కంటే గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పూర్తిగా తెలుసంటే అతిశయోక్తికాదు. ఈ పరిస్థితుల్లో వాట్సప్ డేటాని ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ యాక్సెస్ చేయడం కోసం తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైంది. దీంతో డేటా ప్రైవసీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.

 

ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ 2014లో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసే సమయంలో గతంలో మాదిరిగానే ఒక ప్రత్యేకమైన సర్వీసుగానే దానిని కొనసాగిస్తామని, దాని విషయంలో తమ జోక్యం పెద్దగా ఉండదని ప్రకటించింది. కొంతకాలం సైలెంట్​గా ఉన్న ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఆ తర్వాత వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్ల ఆధారంగా ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారి ప్రొఫైల్స్​ను గుర్తించి వారికి కమర్షియల్​ యాడ్స్​ చూపించడం మొదలుపెట్టడంతో యూరోపియన్ కమిషన్ 110 మిలియన్ పౌండ్ల జరిమానా విధించడానికి సిద్ధపడింది. దీనిపై ఆ టైమ్​లో బుకాయించిన ఫేస్​బుక్​ ఆ తర్వాత తమకు తెలియకుండా పొరబాటున డేటా షేర్ అయిందని ఒప్పుకుంది. అప్పటి నుంచి తాను కొన్న ఇన్​స్టాగ్రామ్, వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తన పరిధిలోకి తేవడానికి ఫేస్​బుక్​ అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇటీవల ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్ మెసెంజర్ మధ్య ఇంటిగ్రేషన్ కూడా చేసింది. దీనికి కొనసాగింపుగా తాజాగా వాట్సప్ డేటాని పంచుకునేందుకు ట్రై చేసింది.

సేకరించే డేటా ఇదే

వాట్సప్ రిజిస్ట్రేషన్ డేటా.. అంటే ఫోన్ నంబర్, ఇండియాలో వాట్సప్ ద్వారా ఏదైనా పేమెంట్ చేస్తే ఆ లావాదేవీ రిఫరెన్స్ నంబర్, పేమెంట్ మోడ్, సర్వీస్ సంబంధిత సమాచారం, వాట్సప్ బిజినెస్ ద్వారా వివిధ వ్యాపార సంస్థలతో యూజర్లు చేసే సంప్రదింపులు, దానికి సంబంధించిన సమాచారం, ఫోన్ మోడల్ నంబర్, ఐపీ అడ్రస్ వివరాలను వాట్సప్ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంచుకుంటుంది.

ఎందుకు ఈ సమాచారం?

చాలా మంది ఆందోళన చెందుతున్నట్లు ఇద్దరు వ్యక్తులు చేసుకునే పర్సనల్​ చాట్, గ్రూపుల్లో పోస్ట్ చేసే మెసేజ్​లను ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, వాట్సప్ నేరుగా చూడలేవు, ఆ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయలేవు. మనం ఒక మెసేజ్ మన ఫ్రెండ్స్​కు పంపించిన వెంటనే అది డెలివర్ అయ్యే వరకే వాట్సప్ సర్వర్లలో, అదీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రిప్టెడ్ పద్ధతిలో ఉంటుంది. అవతలి వ్యక్తికి డెలివరీ అయిన వెంటనే ఆ మెసేజ్ వాట్సప్ సర్వర్ నుంచి తొలగిపోతుంది. అందువల్ల యూజర్లు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు.

కొత్త ప్రైవసీ పాలసీ వెనుక కారణాలు

వాట్సప్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించబోతోంది. ఉదాహరణకు మీకు ఓ కిరాణా షాపు ఉంది. వాట్సప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్​ చేయడం ద్వారా మీ దగ్గర లభించే సరుకుల వివరాలను ఒక క్యాటలాగ్ ద్వారా వాట్సప్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడతారు. మీ కస్టమర్​ తనకు కావలసిన వస్తువులు ఎంపిక చేసుకుని, వాటికి వాట్సప్ పేమెంట్స్ సర్వీసు ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు అతనికి వస్తువులు డెలివరీ చేస్తారు. ఇలాంటి అనేక సేవలు అతి త్వరలో వాట్సప్ లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సప్ బిజినెస్ అకౌంట్ కలిగి ఉన్న మీకు.. మీ కస్టమర్ల ఫోన్ నంబర్, వారు పేమెంట్ చేసిన రిఫరెన్స్ నంబర్, పేమెంట్ మోడ్ వంటివి వాట్సప్ పంపుతుంది. అంతా అనుకుంటున్నట్టు థర్డ్ -పార్టీ అంటే ఎవరో అజ్ఞాత వ్యక్తి కాదు. వాట్సప్ బిజినెస్ ద్వారా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు. దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. కారణం మనం బయట షాపింగ్ మాల్ కు వెళ్ళినా కూడా బిల్ జనరేట్ చేసే సమయంలో ఈ వివరాలు తీసుకుని తమ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రపరుచుకుంటారు. ఇలా డేటాను వాట్సప్ బిజినెస్ అకౌంట్ ద్వారా మనకు వస్తు, సేవలు అందించే సంస్థలకు, లావాదేవీ జరిపిన సందర్భాల్లో అందించడం తప్పు కాదు.

కమర్షియల్​ యాడ్స్​ కూడా!

ఈ డేటా ఆధారంగా ఫేస్​బుక్ కొన్ని సందర్భాల్లో మనకు కమర్షియల్​ యాడ్స్​ చూపించవచ్చు. ఇప్పటివరకు వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటనలు లేవు. కానీ త్వరలో అవి రాబోతున్నట్లు ఇంటర్నల్​ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. యాడ్స్​ విషయంలో కూడా ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పుపట్టాల్సిన పనిలేదు. కారణం ఈ రోజు మనం ఒక యూట్యూబ్ వీడియో చూడాలన్నా, ఒక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ చూడాలన్నా, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ న్యూస్ ఫీడ్ చూడాలన్నా ఐదు సెకన్లకో వ్యాపార ప్రకటన కనిపిస్తుంది. ఫ్రీగా సేవలు లభించే చోట కస్టమర్లే ప్రొడక్ట్ అవుతారు కాబట్టి యాడ్స్ చూపించడానికి కొత్తగా వాట్సాప్ డేటాను ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ వాడుకోవడంలో కూడా తప్పుబట్టాల్సింది లేదు.

మోనోపొలిగా నడుస్తున్నాయా?

టెక్నాలజీ వరల్డ్​లో ఎన్నో సంస్థలు పుట్టుకొస్తున్నప్పటికీ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, అమెజాన్, ఒరాకిల్ లాంటి కొన్నే అధిక శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతోపాటు కొద్దిగా ఎదిగి తమకు పోటీగా వస్తాయనుకున్న స్టార్టప్స్​ను భారీ మొత్తంతో కొనుగోలు చేయటం, వద్దనుకుంటే వాటిని తర్వాత లేకుండా చేయడం టెక్నాలజీ వరల్డ్​లో తరచూ జరిగేదే. ఈ మోనోపొలిని ఆపడానికి అమెరికాతోపాటు వివిధ దేశాల్లో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఏదో రూపంలో ఆయా కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ కారణం వల్ల మంచి ఆలోచనతో వచ్చిన స్టార్టప్స్​ కొన్నాళ్లకే మూతపడుతున్నాయి. లేదా తమ ఆలోచనతో తెచ్చిన సంస్థను ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలకు అమ్ముకుని వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవుతున్న టెక్ ఎక్స్​పర్ట్స్​ ఎందరో ఉన్నారు. మెరుగైన అవకాశాలున్న టెక్నాలజీ రంగాన్ని ఇవి ఎదగనీయకుండా చేస్తున్నాయి. మంచి ఆలోచన ఉన్నా.. వెంచర్ క్యాపిటలిస్టులు దొరక్క, ప్రభుత్వాలతో లాబీయింగ్ చెయ్యలేక వెనకబడుతున్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకూ, వివిధ దేశాల ఐటీ మంత్రులతో ఈజీగా సంప్రదింపులు జరపగలిగే ఐటీ దిగ్గజాలకు చాలా తేడా ఉంటోంది. బలం ఉన్నవాడు మరింత బలవంతుడుగా మారుతున్నాడు, బలం లేనివాడు కనీసం తన స్టార్టప్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించుకోలేక బలైపోతున్నాడు. ఇది మారాలి.. అలాంటి మార్పు వస్తుందని ఆశిద్దాం.

   – నల్లమోతు శ్రీధర్,టెక్నాలజీ ఎనలిస్ట్