
మెదక్టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ.. 17న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే రోహిత్ రావు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్లు హాజరవుతారని పేర్కొన్నారు.
నేడు కలెక్టరేట్ఎదుట ఉద్యోగుల ధర్నా
అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైఖ్య పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కొత్త పెన్షన్, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు, ఆదాయ పన్ను పరిమితి పెంపు అంశాలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు నరేందర్ తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్ కుమార్, ఇక్బాల్పాషా, చంద్రశేఖర్, ఫణిరాజ్, ఫజలుద్దీన్, రఘునాథరావు, చిరంజీవచార్యులు, శివాజీ, కిరణ్ కుమార్, రాధ, నర్సింలు, రామా గౌడ్, శ్రీకాంత్, శేషాచారి, ప్రభాకర్, నిఖిల్, శ్రీనివాస్, నగేశ్, సంతోష్, యాదగిరి గౌడ్, శ్రీహర్ష, సరస్వతి, గాంధీ బాబు, కృష్ణ, రాజు, రేణుక పాల్గొన్నారు.