ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచివుందని నీటిరంగ నిపుణులు దొంతి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. గేట్ల రిపేర్ కు డబ్బులు ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టుల గేట్లు పనిచేయడం లేదన్నారు. కడెం ప్రాజెక్టులో 18గేట్లకు గాను 17 గేట్లే పనిచేస్తున్నాయని..ఆ గేటు కూడా పనిచేస్తే వరద ఉధృతి కొంచెం తక్కువగా ఉండేదన్నారు. వర్షాకాలనికి ముందే అధికారులు ప్రీ మాన్సూన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని..అయితే దానిని అధికారులు పాటించడంలేదని విమర్శించారు. కడెం ప్రాజెక్టు ఉప్పొంగితే మంచిర్యాల పట్టణం మునిగిపోతుందని చెప్పారు. కడెం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ వద్ద గండి పడడంతో సేఫ్ అయ్యామని..లేకపోతే ఊహించని విపత్తు సంభవించేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1995- 96 లో ఇలాంటి పరిస్థితే వచ్చిందని..మళ్లీ ఇన్నాళ్లకు వరద ఉధృతి పెరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖలో మెకానికల్ డిపార్ట్ మెంట్ ను తీసేశారని..వ్యవస్ధ లోపం వల్లే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పారు.