నల్లబెల్లి, వెలుగు : కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన పలువురు ఆదివారంకాంగ్రెస్‌లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం మాధవరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యాడన్నారు. కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, మహేశ్, ఐలయ్య, సురేశ్ పాల్గొన్నారు.