బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి, వెలుగు:  బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి  గుణపాఠం చెప్పాలని పీసీసీ  సభ్యుడు,  నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మంగళవారం నల్లబెల్లి మండలం నారక్కపేట లో దుర్గాదేవి వద్ద పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మాధవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల టైమ్​లో కేసీఆర్   మరోసారి మోసం చేసేందుకు హామీలు ఇస్తున్నారని అన్నారు.  అనంతరం బీఆర్​ఎస్​, బీజేపీ లీడర్లు కొందరు కాంగ్రెస్​లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు తిరుపతిరెడ్డి, అశోక్​, రమేష్​, నవీన్​ పాల్గొన్నారు.