- బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి
ములుగు, వెలుగు : రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. యువమోర్చ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వ 9ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతీ వర్గాన్ని కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రపంచం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రధాని నరేంద్రమోదీ భారత సంస్కృతీ, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, జిల్లా కార్యదర్శి ఎస్.రవీంద్రాచారి, జిల్లా నాయకులు చల్లూరి మహేందర్, డి.రవిరెడ్డి, బాణాల రాజ్ కుమార్, కిసాన్ మోర్చ అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.