హైదరాబాద్: లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తే ఎంత సౌకర్యంగా ఉంటుందో.. రిపేర్ వస్తే అంత ప్రమాదం.. ఇటీవల కాలంలో లిఫ్టు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. లిప్టుల్లో ఇరుక్కొని చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూస్తున్నాం..తాజాగా హైదరాబాద్ సిటీలోని మెహదీపట్నంలో కూడా లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే..
ALSO READ | దొంగతనానికి వచ్చి..ఫాస్ట్ఫుడ్ డబ్బా కిందపడి చనిపోయాడు..
మెహదీపట్నం పరిధిలోని ప్రియా కాలనీ గుడిమల్కాపూర్ లోని వకాస్ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ కావడంతో లిఫ్ట్ గుంటలోపడి వ్యక్తి చనిపోయాడు. ఆ అపార్టుమెంట్ నాలుగో ఫ్లోర్ లో ఉంటున్న సమీ ఉల్లా బైగ్ (55) .. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగా డోర్ తెరుచుకుంది.. అయితే లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయింది. అది గమనించని బైగ్ ముందుకు వెళ్లగా.. 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ గుంటలో పడ్డాడు.. విషయం తెలుసుకున్న అపార్టు మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు.. బైగ్ ను బయటితీసి ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.