కొల్లాపూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థికసాయం అందిస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కోడేరు మండలంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాలను వివరించారు.
మండలంలోని ఎత్తం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. తెలంగాణ వచ్చినప్పడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం నేడు అప్పులపాలయ్యిందన్నారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.