ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోనరావుపేట, వెలుగు: ఇంటింటికి ప్రతిమ షౌండేషన్​సేవలు అందిస్తున్నామని, యువత నైపుణ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. శనివారం కోనరావుపేట మండలం నిజామాబాద్ లో ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వికాస్ రావు, దీప దంపతులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత హెల్త్ క్యాంపులో 633మందిని పరీక్షించి మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

గండ్లు పూడ్చాలని సంతకాల సేకరణ

గంగాధర, వెలుగు : భారీ వర్షాలతో గండ్లు పడిన నారాయణపూర్, ఎల్లమ్మ చెరువుల గండ్లు పూడ్చాలని కోరుతూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు శనివారం రైతుల సంతకాలు సేకరించారు. నారాయణపూర్ రిజర్వాయర్ మీద ఆశతో యాసంగి పంటలకు సిద్ధమవుతున్న నాలుగు మండలాల ఆయకట్టు రైతులను ఆదుకోవాలని, నారాయణపూర్ ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తెగిన కట్టలకు మరమ్మతు చేసి రైతులను ఆదుకోకపోతే రైతులతో కలిసి ఎమ్మెల్యే, అధికారులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్​రెడ్డి, దళిత మోర్చా అధికార ప్రతినిధి వినయ్​సాగర్, లీడర్లు అజయ్, మల్లికార్జున్, శ్రీనివాస్, క్రాంతి, ప్రశాంత్ పాల్గొన్నారు. 

సింగరేణి ఎడ్యుకేషన్‌‌‌‌ జీఎంగా వెంకటేశ్వరరావు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ ఎడ్యుకేషన్‌‌‌‌ విభాగం జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా రామగుండం రీజియన్‌‌‌‌ సేప్టీ జీఎంగా వ్యవహరిస్తున్న ఎన్‌‌‌‌.వెంకటేశ్వరరావును నియమించారు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ జీఎంగా ఉన్న పద్మనాభరెడ్డి రిటైరయ్యారు. అలాగే రామగుండం రీజియన్ సేప్టీ జీఎంగా ఆర్జీ 2 ఏరియా ఎస్‌‌‌‌ఓటు జీఎంగా వ్యవహరిస్తున్న ఎస్‌‌‌‌.సాంబయ్యను నియమించారు.

ఆధార్ అప్​డేట్​కు మరో అవకాశం 

రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో 2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి అప్​డేట్ చేసుకోవడానికి అవకాశం ఉందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఆధార్ రెన్యూవల్​పై రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. 2015 సంవత్సరం కంటే ముందు గుర్తింపు కార్డు పొందిన వారంతా మార్పుచేర్పుల కోసం సంబంధిత పత్రాలతో ఆధార్ నమోదు కేంద్రాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇన్​చార్జి డీఆర్ఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 258 కొనుగోలు కేంద్రాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో  258 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ధాన్యం కొనుగోలపై తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్వోలు క్షేత్రస్థాయిలో కొనుగోలు సెంటర్లను తనిఖీ చేయాలని, సోమవారం నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం జిల్లాలోని డబుల్ ఇండ్ల  నిర్మాణాల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగాల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ ఆఫీసర్లను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్  కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇన్​చార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. 

7న మేడిపల్లి నిర్వాసితుల ‘చలో కలెక్టరేట్’

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌తో నిర్వాసితులైన లింగాపూర్‌‌, మేడిపల్లి ఎస్సీ కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నవంబర్​7న చలో కలెక్టరేట్‌‌‌‌ చేపడుతున్నట్టు అఖిలపక్షం కమిటీ నాయకులు తెలిపారు. శనివారం లింగాపూర్‌‌‌‌ మాజీ సర్పంచ్‌‌‌‌ ఇరికిల్ల శంకరయ్య అధ్యక్షతన రామగుండంలో సమావేశమైన లీడర్లు సింగరేణి ప్రాజెక్ట్‌‌‌‌ వల్ల లింగాపూర్‌‌‌‌, మేడిపల్లి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్‌‌‌‌కు వివరిస్తామన్నారు. ఎస్సీ కాలనీ వాసులకు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ అమలు చేయాలని, బ్లాస్టింగ్ వల్ల కూలిపోయిన, దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం త్వరగా చెల్లించాలనిడిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ లీడర్‌‌‌‌ కౌశిక హరి, కార్పొరేటర్లు స్వామి, సతీశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

పోలీస్ ​వెహికల్ ​ఢీకొని ఒకరికి గాయాలు, పరారీలో డ్రైవర్​ 

వేములవాడ, వెలుగు:  పట్టణంలోని మొదటి బైపాస్ లో నడుచుకుంటూ వెళుతున్న బిహార్ కు చెందిన లాల్ బచ్చన్ అనే కార్మికుడిని జగిత్యాల హెడ్ క్వార్టర్ కు చెందిన పోలీస్​వెహికల్ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. యాక్సిడెంట్ కాగానే వాహన డ్రైవర్ పరారయ్యాడు. అదే వాహనానికి చెందిన మరో కానిస్టేబుల్ క్షతగాత్రుడిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీస్ వాహనం నడిపించిన డ్రైవర్​ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని టౌన్ సీఐ వెంకటేష్​ తెలిపారు.

నీటి సంపులో పడి చిన్నారి మృతి

తిమ్మాపూర్, వెలుగు: ఆడుకుంటూ నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో జరిగింది. గ్రామానికి చెందిన పుష్పలత, నవీన్ కూతురు ఆరాధ్య(2)  శుక్రవారం రాత్రి తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. కాసేపటి తర్వాత ఆరాధ్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. ఈక్రమంలో పాప నీటి సంపులో కనిపించింది. వెంటనే బయటకు తీయగా అప్పటికే చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు భోరున విలపించారు.

ముగిసిన అల్ఫోర్స్ ట్రైనింగ్ క్యాంప్

కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్టూడెంట్లకు అక్టోబర్31 నుంచి నవంబర్ 5 వరకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి తెలిపారు. శనివారం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిబిరంలో విద్యార్థులకు భాషానైపుణ్యం, భావ వ్యక్తీకరణ, మౌఖిక పరీక్షలకు అవసరమైన విషయాలను బోధించామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శైలజ, వైస్ ప్రిన్సిపల్ తిరుపతి, లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

ధరణి అప్లికేషన్ల పై కలెక్టర్ ​విచారణ

కోరుట్ల,వెలుగు: ధరణిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కోరుట్ల రైతులు పెట్టుకున్న అప్లికేషన్లను జగిత్యాల కలెక్టర్ రవి ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. శనివారం కోరుట్ల పట్టణ శివారు కల్లూరు రోడ్డు రైల్వే లైన్​ సమీపంలోని సర్వే నంబర్​ 213లోని భూ సమస్యపై ధరణిలో దరఖాస్తు చేసుకున్న వారి భూమిని కలెక్టర్  పరిశీలించారు. విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని తహసీల్దార్ రాజేశ్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట  అడిషనల్ కలెక్టర్​లత, ఆర్డీవో వినోద్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

ఇంటింటికీ ప్రతిమ ఫౌండేషన్​సేవలు

కోనరావుపేట, వెలుగు: ఇంటింటికి ప్రతిమ షౌండేషన్​సేవలు అందిస్తున్నామని, యువత నైపుణ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు అన్నారు. శనివారం కోనరావుపేట మండలం నిజామాబాద్ లో ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వికాస్ రావు, దీప దంపతులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత హెల్త్ క్యాంపులో 633మందిని పరీక్షించి మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

కరాటే ఇష్టం లేక కిడ్నాప్​ డ్రామా!

పిల్లలను పేరెంట్స్​కు అప్పజెప్పిన పోలీసులు
మెట్ పల్లి, వెలుగు: కరాటే నేర్చుకోవడం ఇష్టం లేని ఇద్దరు ఐదో తరగతి స్టూడెంట్లు తమను కిడ్నాప్​చేశారని నాటకమాడారు. మెట్ పల్లి ఎస్సై కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన శ్రీరాముల రిత్విక్ (11), సీహెచ్ సాహిత్(10) ఓ ప్రైవేటు స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు వీరికి కరాటే నేర్పడం కోసం పట్టణానికి చెందిన ఓ ఇన్ స్టిట్యూట్​లో అడ్మిషన్ తీసుకున్నారు. శనివారం ఉదయం క్లాసులకు వెళ్తున్నామని చెప్పిన పిల్లలు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కరాటే ఇన్​స్ట్రక్టర్​ను అడగగా రెండు రోజులుగా వారు రావడం లేదని చెప్పడంతో  పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్​చేశారేమోనని పోలీసులకు కంప్లైంట్​ఇచ్చారు. సీసీ ఫుటేజీ చూసిన పోలీసులు పిల్లలు కోరుట్ల వైపు వెళ్లినట్లు గమనించారు. అనంతరం గాలించి వారిని పట్టుకున్నారు. కాగా ఇద్దరు వ్యక్తులు తమపై మత్తుమందు చల్లి కట్టేసి గోనెసంచిలో పడేశారని అన్నారు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో కరాటే అంటే ఇష్టంలేదని, పేరెంట్స్​కు చెబితే కొడతారని భయపడి ఇలా చేశామని స్టూడెంట్లు 
తెలిపారు.  

రైతుల వృద్ధి కోసమే కిసాన్​ మేళా

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతీ రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే గ్రామీణ కిసాన్ మేళా నిర్వహించామని బీజేపీ జాతీయ లీడర్​పొల్సాని సుగుణాకర్ రావు అన్నారు. శనివారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో మూడు రోజులు నిర్వహించిన కిసాన్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో రైతులు అత్యాధునిక యంత్రాలతో అధిక పంటలు పండిస్తున్నారని అన్నారు. అనంతరం మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్​చార్జి మురళీధర్ రావు మాట్లాడుతూ పంటల ఉత్పత్తిగా డెయిరీ, పౌల్ట్రీ, మత్స్య సంపద తదితర అనుబంధ రంగాలను కూడా రైతులు ఎంచుకోవాలన్నారు. గొర్రెలు పంచినట్టే ఆవు, బర్రెను ప్రతి ఇంటికి అందజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన రైతులు కిసాన్​మేళా గురించి అభిప్రాయాలను
పంచుకున్నారు.