న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి కె.చంద్రశేఖర్ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) అండర్ సెక్రటరీ అన్షుమాన్ మిశ్రా ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుసరించి నాన్ స్టేట్ సివిల్ సర్వీస్‌లో సేవలందిస్తున్న చంద్రశేఖర్‌కు పదోన్నతి కల్పించినట్లు వెల్లడించారు.
కన్ఫర్డ్ ఐఏఎస్‌గా చంద్రశేఖర్ రెడ్డి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొన్నారు. 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో ఏర్పడ్డ ఖాళీల్లో చంద్రశేఖర్ రెడ్డి ఎంపికైనట్లు వివరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ప్రొహిబిషన్ పిరియడ్‌లో ఉంటారని, ఆయనను తెలంగాణకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.