Bharathanatyam Trailer: యూనిక్ క్రైమ్ కామెడీతో భరత నాట్యం..విభిన్నమైన జోనర్లో దొరసాని డైరెక్టర్

Bharathanatyam Trailer: యూనిక్ క్రైమ్ కామెడీతో భరత నాట్యం..విభిన్నమైన జోనర్లో దొరసాని డైరెక్టర్

సూర్య తేజ (Surya Teja) ఏలే హీరోగా ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత నాట్యం’(Bharathanatyam). మీనాక్షి గోస్వామి హీరోయిన్. పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు.

ఇదొక యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది క్యాప్షన్.. ఈ క్రైమ్ కామెడీ మూవీకి స్టోరీ సూర్య తేజ ఏలే రాయగా..స్క్రీన్ ప్లే బాధ్యతలను సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్రలు చేపడుతున్నారు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఏం పేరు రాజు సుందరం సర్..ఏం చేస్తుంటావ్..అని ఎస్ ఐ అజయ్ ఘోష్ అడగగా..డిపార్ట్మెంట్ సార్..డైరెక్షన్ డిపార్ట్మెంట్..అంటూ ట్రైలర్ మొదలైంది. దీన్ని బట్టి చూస్తే..సినిమా పరిశ్రమలో దర్శకుడు అవ్వాలనుకొనే ఓ యువకుడి కథ భరత నాట్యం అని అర్ధం అవుతోంది. 

కిరాయి గుండాలు, విలన్ల మధ్య వచ్చే ఫన్నీ కామెడీ సీన్లు..అలాగే వైవా హర్ష డైలాగ్స్,యాక్టింగ్ ఇరగదీశాడు. ప్రముఖ రైటర్, యాక్టర్ హర్షవర్ధన్ విలనిజం ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో చుట్టే తిరిగే దరిద్రం ఇక ఎవడి చుట్టూ తిరగదనేలా క్యారెక్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా కామెడీ, కమర్షియల్ అంశాలు కలిపి తీసిన భరత నాట్యంపై..తాజా ట్రైలర్ ఆడియన్స్ లో మంచి అంచనాలు పెంచేసింది.

ట్రైలర్ చివర్లో 'సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అంటూనే భరత నాట్యం అంటే కేవలం నాట్యం కాదు..ఇంకేదో ఉందనేలా సస్పెన్స్ పెంచుతున్న ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

విభిన్నమైన కంటెంట్ తో వచ్చిన దొరసాని మూవీతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర నుంచి వస్తోన్న రెండో సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే 2024 ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.