జడ్చర్ల, వెలుగు : శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. నక్కలబండ తండా అంగన్ వాడీ సెంటర్లో శుక్రవారం తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. పిల్లలకు గుడ్లు, పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చైతన్య చౌహాన్, రాధిక, బాలమణి ఉన్నారు.
మరికల్, వెలుగు : గర్బిణులు, బాలింతలు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో సరోజిని అన్నారు. శుక్రవారం 7వ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తల్లి పాలే పిల్లలకు శ్రేయస్కరమన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గోపాల్, ఏఎన్ఎం సువర్ణ, శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యులు మథిన్, టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.