
నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మున్సిపల్ కేంద్రంలో పారిశుధ్య అవసరాల కోసం నూతన వాహనాలను ప్రారంభించి, మున్సిపల్ కార్మికులకు హెల్త్ కార్డ్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
త్వరలో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ కాల్వల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలిమల్లు, మున్సిపల్ కమిషనర్ తాజుద్దీన్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.