రేవంత్ను మరోసారి బూతులు తిట్టిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డిపై మరోసారి  తీవ్ర పదజాలంతో  విమర్శలు చేశారు  డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్.  బూతులు తిడుతూ రెచ్చిపోయారు.  ఓటు అడిగే హక్కు ఎవరికి లేదని.. అన్నీ చేసిన తమకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు తనను విమర్శించే ధైర్యం లేదన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేసిన రేవంత్.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.  లేకపోతే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 ఇటీవల మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రెడ్యా నాయక్ రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. భూమికి మూరెడు ఉంటడని.. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేయడమే రేవంత్ నైజం అంటూ ఆరోపణలు చేశారు.  

రాహుల్ గాంధీనీ  సస్పెండ్ చేస్తే ఓ పీసీసీ చీఫ్ గా  రేవంత్ కనీసం నిరసన  కార్యక్రమాలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదే తానయితే రాష్ట్రంలో హల్ చల్ చేసేటోడినంటూ  రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనను దించాలని చూస్తున్నారన్నారు.