ఈ దోస్త్ బిర్యానీ సెంటర్ సార్లది

కరోనా ఆగం చేయని రంగమే లేదు. ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇప్పటి వరకూ స్కూళ్లు, కాలేజీలు రీ–ఓపెన్ కాలేదు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది  ప్రైవేట్ టీచర్స్‌‌‌‌‌‌‌‌, లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌. ఎలాంటి ఉపాధి లేక కొంతమంది ఇబ్బంది పడుతుంటే.. ఇంకొందరు మాత్రం కొత్త ఆలోచనలతో బిజినెస్‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారు. అచ్చంగా అలాగే, ఈ ఇద్దరు లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌ కూడా కంఫర్ట్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకొచ్చారు. మంచిర్యాలలో ‘దోస్త్‌‌‌‌‌‌‌‌ బిర్యానీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పెట్టి సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.జాబ్‌‌‌‌‌‌‌‌కి రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ ఈ బిజినెస్‌‌‌‌‌‌‌‌నే చూసుకుంటున్నారు.

మంచిర్యాల, వెలుగు:పరకాలకు చెందిన చిదిరాల సందీప్ ఎంటెక్ కంప్యూటర్స్​ చదివాడు. 2015 నుంచి మంచిర్యాలలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కంప్యూటర్​ సైన్స్​ లెక్చరర్​గా పనిచేస్తున్నాడు. ఒకపక్క జాబు చేస్తూనే గవర్నమెంట్​ జాబ్​ కోసం ట్రై చేస్తున్నాడు.  కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం గురుడుపేట్​ గ్రామానికి చెందిన మార్క ఆంజనేయులుఎం.ఏ. ఇంగ్లిష్​ లిటరేచర్, బీఈడీ​ పూర్తి చేశాడు. ఈయన కూడా వాగ్ధేవి డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్​ లెక్చరర్​గా పని చేసేవాడు. నెలనెలా జీతాలతో హ్యాపీగా సాగిపోతున్న ఈ ఇద్దరి జీవితాన్ని లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ కుదిపేసింది. ఏప్రిల్ నుంచి జీతం బంద్‌‌‌‌‌‌‌‌ అయిపోయింది. ఇద్దరివీ పేద కుటుంబాలు కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

బిజినెస్ బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చాలీచాలని ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా ఏదైనా బిజినెస్​ చేయాలని అనుకున్నారు. లెక్చరర్​ జాబ్​కు రిజైన్​ చేసి ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో మంచిర్యాల లక్ష్మీ టాకీస్​ చౌరస్తాలో ‘దోస్త్​ బిర్యానీ సెంటర్’​ను అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టార్ట్ చేశారు. ఇద్దరు మాస్టర్లు, మరో ఇద్దరు వర్కర్లను పెట్టుకున్నారు. తక్కువ రేటుకే చికెన్​ బిర్యానీ, ఫాస్ట్​ఫుడ్​ని టేస్టీగా అందిస్తుండటంతో నెలరోజుల్లోనే బిజినెస్​ క్లిక్​ అయింది. రోజుకు ఎనిమిది వేల నుంచి పది వేల రూపాయల వరకు  కౌంటర్​ అవుతోందని చెప్పారు.  బిల్డింగ్​ రెంట్​, వర్కర్స్​ శాలరీస్​, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌​ ఖర్చులు పోగా… గతంలో తమకు వచ్చే జీతాల కంటే ఎక్కువే మిగులుతున్నాయని చెప్తున్నారు. ‘యూత్​ వైట్​ కాలర్​ జాబ్స్​ కోసం ఎదురుచూస్తూ టైమ్​ వేస్ట్​ చేయడం కంటే… కొత్త ఐడియాలతో ఏదైనా బిజినెస్​ స్టార్ట్​ చేసి కష్టపడితే సక్సెస్​ కావొచ్చు’ అని  నిరూపిస్తున్నారు సందీప్​ అండ్​ ఆంజనేయులు.