
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2023- –24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్‌కు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ -తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొదటి విడత: రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 16 నుంచి జూన్ 10 వరకు (రూ.200 అప్లికేషన్ ఫీజు) ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మే 20 నుంచి జూన్ 11 వరకు పెట్టుకోవచ్చు. సీట్లు పొందినవారు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 16 నుంచి 25 వరకు చేసుకోవచ్చు.
రెండో విడత: రిజిస్ట్రేషన్ జూన్ 16 నుంచి 26 వరకు (రూ.400 అప్లికేషన్ ఫీజు) అప్లై చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు జూన్ 16 నుంచి 27 వరకు చేసుకోవచ్చు. సీట్లు పొందినవారు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జులై 1 నుంచి 5 వరకు చేసుకోవచ్చు.
మూడో విడత: రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జులై 1 నుంచి 5 వరకు (రూ.400 అప్లికేషన్ ఫీజు) దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు జులై 1 నుంచి 6 వరకు పెట్టుకోవచ్చు. సీట్లు పొందినవారు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జులై 10 నుంచి 14 వరకు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.dost.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.