
- ఆలస్యంపై సీఎంఓ ఆరా
- వెంటనే రిలీజ్ చేయాలని కౌన్సిల్ కు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్, షెడ్యూల్ మే 1న రిలీజ్ కానున్నది. ఈ మేరకు మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంటర్ ఫలితాలు రిలీజై వారమైనా ఇంకా దోస్త్ షెడ్యూల్ రిలీజ్ కాకపోవడంపై ‘దోస్త్ నోటిఫికేషన్ ఎప్పుడు?’ శీర్షికతో ‘వీ6 వెలుగు’ లో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై సీఎంఓ, విద్యాశాఖ అధికారులు ఆరా తీశారు.
దోస్త్ షెడ్యూల్ రిలీజ్ ఎందుకు ఆలస్యమైందని హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, ఓ అధికారి మితిమీరిన జోక్యంతో ఆలస్యమైనట్టు వారు చెప్పినట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని కౌన్సిల్ అధికారులను ఆదేశించారు. దీంతో మే 1న దోస్త్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు.