డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అధికారికంగా సంచార్ సాథీ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఫ్రాడ్ కాల్స్ కి చెక్ పెట్టొచ్చు. అంతేకాదు మన మొబైల్స్ భద్రతను పెంచే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డాట్ ఈ యాప్ ని శనివారం లాంచ్ చేసింది. ఈ యాప్ తో కాల్ లాగ్ నుంచి నేరుగా అనుమానాస్పద యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇట్టే గుర్తు పట్టొచ్చు.
ALSO READ | టెక్నాలజీ : యాపిల్ ఫ్యాన్స్ కోసం కొత్త యాప్
2023మే లో సంచార్ సాథి పోర్టల్ ను ప్రారంభించింది డాట్. దీనికి కొనసాగింపుగా సంచార్ సాథి యాప్ ను శనివారం ప్రారంభించింది.. మొబైల్ యూజర్లకు మరింత మెరుగైన భద్రత అందించేందుకు లక్ష్యంగా ఈ యాప్ ను ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు వారి మొబైల్ కనెక్షన్‌లను సురక్షితంగా ఉంచడానికి , మోసపూరిత యాక్టివిటీస్ కు చెక్ పెట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
సంచార్ సాథి యాప్ ఫీచర్లు:
- మొబైల్ ఫోన్ సేఫ్టీ, స్కామ్స్ నుంచి యూజర్ల రక్షణకు సంచార్ సాథి యాప్ అనేక ఫీచర్లను అందిస్తోంది.
- సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ఫీచర్ ఉంటుంది. దీంతో కస్టమర్లు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్ సెట్లను ట్రేస్ చేయొచ్చు.. బ్లాక్ చేయొచ్చు. దీంతో దొంగిలించబడిన డివైజ్ లను దుర్వినియోగం చేయకుండా చెక్ పెట్టొచ్చు.
- సంచార్ సాథి యాప్ లో మరో ఫీచర్.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ , కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP). ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ మొబైల్ కనెక్షన్ల ద్వారా ఏవైనా అనధికార యాక్టివిటీస్ జరిగాయా లేదా తెలుసుకోవచ్చు.. అటువంటి వాటిని నియంత్రించవచ్చు.
- కనెక్షన్ ట్రాకింగ్: కస్టమర్లు తమ పేరుతో ఎన్ని యాక్టివ్ మొబైల్ కనెక్షన్‌లు రిజిస్టర్ అయ్యాయో చెక్ చేయొచ్చు. మీకు తెలియకుండా ఏవైనా మొబైల్ కనెక్షన్లు ఉంటే వాటిని గుర్తించొచ్చు. వాటిని డిస్‌కనెక్ట్ చేయొచ్చు.