‘డబుల్’ ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నం..

‘డబుల్’ ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నం..
  • కరెంట్, నీళ్ల సౌలతులు కల్పించాలని అహ్మద్ గూడ వాసుల రిక్వెస్ట్
  • బల్దియా ప్రజావాణిలో 100 మంది లబ్ధిదారుల వినతి
    ​​​​​

హైదరాబాద్ సిటీ, వెలుగు: అహ్మద్ గూడలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు, తాళాలు ఇచ్చి ఏడాది అయినా గృహ ప్రవేశాలు చేయలేకపోతున్నామని దాదాపు 100 మంది లబ్ధిదారులు వాపోయారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్​ఆమ్రపాలికి వినతిపత్రం అందజేశారు. గతేడాది దసరాకు ఇండ్లలోకి పోవాలని అనుకున్నప్పటికీ కరెంట్, నీళ్ల వసతులు లేకపోవడంతో వెళ్లలేకపోయామని వాపోయారు.

పెండింగ్ పనులు పూర్తి చేసి తమకు ఇండ్లను అప్పగించాలని కోరారు. మూడు నెలల్లోపనులు పూర్తిచేస్తామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 90 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్​ఆమ్రపాలి తెలిపారు. ఈ వారం ఎక్కువగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి.