బర్ల కొట్టాలుగా మారిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు

మునగాల, వెలుగు :   సూర్యాపేట జిల్లా మునగాలలో  ఏడాది కింద నిర్మాణాలు ప్రారంభించిన డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో బర్లకు ఆవాసాలుగా మారాయి. ఊరికి 60 ఇండ్లు మంజూరవగా ఏడాది కింద పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్​ సగం వరకు పూర్తి చేశాడు. బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో డబుల్​బెడ్​రూం ఇండ్ల కాంప్లెక్స్​చుట్టూ పిచ్చిగడ్డి పెరిగింది. 

అడవిని తలపిస్తుండడం, నిరుపయోగంగా ఉండడంతో స్థానికులు అక్కడ తమ బర్లు కట్టేసుకుంటున్నారు. ఎంతోమంది నిరుపేదలు ఇండ్ల కోసం ఎదురుచూస్తుండగా సగం కట్టి వదిలివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు తొందరగా పనులు పూర్తి చేయించి పంపిణీ చేయాలని కోరుతున్నారు.