కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా టెక్రియాల్‌లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లకు రిపేర్చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్‌లో 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించగా అవి శిథిలమయ్యాయి. పునాదులు, బెస్మిట్ దగ్గర పగుళ్లు రావడం, బీమ్‌లు, గోడల మధ్య గ్యాప్ఏర్పడడంతో కంట్రాక్టర్మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నెల 19న కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి లోపాలను ఎత్తిచూపారు. ఈ నెల 20న వెలుగులో ‘గోడలకు పగుళ్లు.. కదులుతున్న పునాదులు' శీర్షకతో వార్తప్రచురితమైంది.
టెక్రియాల్డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద జరుగుతున్న రిపేర్లను డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా వస్తానని చెప్పిన ఎమ్మెల్యే, ఇప్పడు ఆగమేఘాల మీద మేస్ర్తీలను పెట్టించి మెరుగులు దిద్దుతున్నారని విమర్శించారు. చాలెంజ్‌కు పోయి పైపై పనులు కాకుండా, ఇండ్లను పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మించాలని డిమాండ్ చేశారు.