భద్రాచలం,వెలుగు : అశోక్‌నగర్ కొత్తకాలనీ వరద బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. ఎంపిక చేసిన బాధితులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
తహసీల్దారు శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.