
- ఆగస్టు 20లోగా పంపిణీ చేయకుంటే మేమే పంచుతాం
దుబ్బాక, వెలుగు: రెండేండ్ల కింద పూర్తయిన డబుల్‌బెడ్ రూమ్‌లు బొమ్మలుగా మారాయని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో కార్మికుల కోసం నిర్మించిన 84 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే పేదలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా డ్రాలు తీసి 20లోగా లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోతే, తామే ఆ ఇండ్లను పంచుతామని స్పష్టం చేశారు.
అనంతరం దుబ్బాక పట్టణానికి చెందిన మల్లుగారి అనిల్ రెడ్డి గాయపడిన విషయం తెలుసుకుని పరామర్శించారు. అక్బర్పేట-–భూంపల్లి మండలం బొప్పాపూర్గ్రామానికి చెందిన కారంగుల మోహన్‌రావు మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు అంబటి బాలేశ్‌గౌడ్, దూలం వెంకట్, మచ్చ శ్రీనివాస్, సుంకోజి ప్రవీణ్, నేహాల్గౌడ్, గోపరి యాదగిరి, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.