
మా నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు మాకే ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను స్థానికులకే ఇవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి లబ్ధదారులు నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం లో 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు వరకు కేటాయించకుండా ఆశ చూపించి ఓటు బ్యాంకు రాజకీయ చేస్తున్నారని ఆరోపించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలు పని మనుషులు డ్రైవర్లకు,ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలు, ఘట్ కేసర్ ఉమ్మడి మండలంలో ఉన్న అర్హులైన అందరికీ కేటాయించేంతవరకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తామని బీజేపీ శ్రేణులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నిరసన ఆపబోమని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.