డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఉద్రిక్తత ... పోలీసులు, కాలనీవాసులకు మధ్య ఘర్షణ

హనుమకొండ జిల్లా బాలసముద్రం డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది.  ఇండ్లు తమకు మంజూరైనా.. నిర్మాణం ముగిసినా అధికారులు ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం లేదని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాళాలు పగలగొట్టి ఇండ్లల్లోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా లబ్దిదారులు వారితో ఘర్షణకు దిగారు. 

భారీ వర్షాలతో తమ గుడిసెలు కూలిపోయాయని.. ఈ వర్షంలో ఎక్కడ ఉండాలో చెప్పాలంటూ పోలీసు అధికారులను లబ్దిదారులు నిలదీశారు.  దీంతో కాసేపు పోలీసులకు కాలనీవాసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏదో ఒకటి తేల్చేదాకా అక్కడి నుంచి కదలమంటూ చిన్నపిల్లతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బైఠాయించిన లబ్ధిదారులు.