- మహబూబాబాద్ లో పేదల గుడిశెలను కూల్చేసిన మున్సిపల్ అధికారులు
- అక్కడే బైఠాయించి న్యాయం చేయాలంటున్న బాధితులు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. రెండు నెలలుగా ప్రభుత్వ భూమిలో 150 మందికి పైగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు చెప్పినా.. ఖాళీ చేయకపోవడంతో.. ఇవాళ కూల్చివేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించకపోగా... తమ గుడిసెలను తొలగించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. తమ గుడిసెలను కూల్చివేయొద్దంటూ అధికారుల కాళ్ల మీద పడి వేడుకున్నారు.
మాకు ఇద్దరు ఆడ పిల్లలు.. మాకు ఇళ్లు లేదు ఏమీ లేదు.. కిరాయికి ఉంటున్నాం.. పూట గడవాలంటే ఏదో ఒక పనిచేయాల్సిందే.. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి గుడిశెలను కూలగొట్టేశారు. సరుకులు, వస్తువులను బయటపడేసి కాల్చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని.. మా గుడిశెలు మాకు తిరిగి వేసిచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని బాధితులు అక్కడై బైఠాయించారు. గుడిసెలను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాసంఘాల నేతలు. బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఆస్పత్రిలో దారుణం..మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి