లాటరీ తీసి రెండేళ్లయినా ఇండ్లు ఇవ్వారా?

లాటరీ తీసి రెండేళ్లయినా ఇండ్లు ఇవ్వారా?

గజ్వేల్, వెలుగు: డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం లాటరీ తీసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇండ్లు ఇవ్వడంలేదని గజ్వేల్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని ఐవోసీ ఆఫీస్​ కాంప్లెక్స్​ వద్దకు తరలివచ్చి ముట్టడికి యత్నించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో రెండేళ్ల కింద కలెక్టర్, ఆర్డీవో  సమక్షంలో లక్కీ డ్రా ద్వారా 1100 లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇండ్లు కేటాయించినా పట్టాలు ఇవ్వడం లేదన్నారు. తమకి ఇంటి పట్టాతో పాటు పొజిషన్ వెంటనే చూపాలన్నారు.