మహబూబాబాద్: అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం (అక్టోబర్ 25) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఆమె పర్యటించారు. పలు ఆభివృధ్ధి పనులుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క.. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం.. దీపావళి పండుగ తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
ఏజెన్సీలో సాగుచేసుకుంటున్న గిరిజన రైతుల భూములుకు పట్టాలు ఇస్తామని.. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మీకు భూమి పట్టాలు చేయిస్తామంటూ దళారులు వస్తున్నారని.. ఎవరిని నమ్మకండని.. ప్రభుత్వమే అర్హులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీల్లో గిరిజనులు, గిరిజన నేతరులు మోసపోయారని.. రైతులు సాగుచేసుకుంటున్న భూములుకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు.
ALSO READ | దక్షిణాదిపై మోదీ వివక్ష..మా పన్నులను నార్త్కు దోచి పెడుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
రేపు.. మాపు అంటూ 10 సంవత్సరాలు కాలం వెళ్ళదీశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అందరికీ రేవంత్ సర్కార్ అండంగా ఉంటుందని.. ధైర్యంగా ఉండండని ఈ సందర్భంగా రైతులకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.